బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ కమెడియన్..!

ఇటీవల వైసిపి పార్టీలో చేరి ఆ పార్టీ తరుపున తెగ ప్రచారం చేసాడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ. ఎన్నికల హడావిడి తో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఒకటి , రెండు తప్ప పెద్దగా సినిమాలు ఏమీ చేయట్లేదు. అవి కూడా చిన్న చిత్రాలే. అయితే ఎన్నికలు ఎలాగూ ముగిసాయి కాబట్టి ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని అలీ భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఏకంగా ఓ భారీ చిత్రంలో నటించడానికి అలీ రెడీ అయ్యాడు.అయితే అది టాలీవుడ్ స్టార్ హీరో చిత్రం. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో చిత్రంలో నటించడానికి రెడీ అయిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ కండల వీరుడు.. సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘దబాంగ్ 3’ లో ఛాన్స్ కొట్టేసాడు అలీ. ప్రభుదేవా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అలీ సల్మాన్ పక్కన పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడట. ఈ సందర్భంగా అలీ తన ఫ్యామిలీ తో కలిసి సెట్లో సల్మాన్ తో ఫోటో దిగారు. బ్లాక్ బస్టర్ దబాంగ్ సిరీస్ కు సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ విలన్ గా కనిపించబోతుండగా… హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటిస్తుంది.

Share.