విదేశీ అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకున్న హీరోయిన్స్

ప్రేమ జాతి, కులం, మతం చూసుకోదు. ఇదేదో ఆర్ట్ ఫిల్మ్ లో డైలాగ్ కాదు. నిజం. వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ప్రముఖులు కులాంతర, మతాంతర వివాహాలు మాత్రమే కాదు మన దేశం కానీ వారిని సైతం ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తున్నారు. ఇలా విదేశీయులను ప్రేమించి, పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అటువంటి వారిపై ఫోకస్..

మాధవి Madhaviమెగాస్టార్ చిరంజీవి పక్కన నటించిన మాధవి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశారు. ఆమె టైటిల్ రోల్ పోషించిన మాతృదేవోభవ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈమె వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మ అనే అబ్బాయిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఇతని తల్లి జర్మనీ, తండ్రి ఇండియన్. ఇప్పుడు రాల్ఫ్ శర్మ, మాధవి న్యూ జెర్సీలో జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు.

రంభ Rambhaఅందాల సుందరి రంభ కెనడాకు చెందిన ఇంద్రాన్ ని 2010 లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి లాన్య అనే కూతురు పుట్టింది. పాపకు టొరంటోలో రంభ జన్మనిచ్చింది. 2015 మరో పాప కూడా పుట్టింది. అయితే కొంతకాలంగా రంభ భర్త ఇంద్రాన్ కి దూరంగా ఉంటోంది.

అపర్ణ Aparnaసుందరకాండ సినిమాలో చిలిపి పనులతో నవ్వించి, మూవీ చివర్లో కంటతడి పెట్టించిన అపర్ణ కూడా ఎన్నారై శ్రీకాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం వీరు అమెరికాలో నివసిస్తున్నారు.

లయ Layaఅచ్చమైన తెలుగు నటి లయ స్వయం వరం సినిమా ద్వారా పరిచమయి, స్కిన్ షోకి దూరంగా ఉండే పాత్రలను చేస్తూ మంచి పేరుతెచ్చుకుంది. ఈమె ఎన్నారై డాక్టర్ శ్రీ గణేష్ ని పెళ్లిచేసుకుంది. ఈ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. ప్రస్తుతం వీరు కాలిఫోర్నియా లో నివసిస్తున్నారు.

గోపిక Gopikaమలయాళ నటి గోపిక కొన్ని తెలుగు చిత్రాల ద్వారా ఇక్కడి వారికి పరిచయం. ఈమె ఎన్నారై డాక్టర్ అజిలేష్ ని కళ్యాణమాడారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. ఇప్పుడు వీరు ఆస్ట్రేలియాలో సంతోషంగా జీవిస్తున్నారు.

మీరా జాస్మిన్ Meera Jasmineభద్ర సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్, అమ్మాయికోసం, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించి తెలుగువారికి బాగా దగ్గరైంది. ఈ నటి దుబాయ్ కి చెందిన అనిల్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది.

Share.