‘బాహుబలి’ ‘పద్మావత్’ లను మించే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది : కంగనా

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు ఓ ప్రత్యేకత ఉంటుంది. ముక్కుసూటి తనం ఆమె చేసే కామెట్లు ఎప్పుడూ సంచలనం సృష్టిస్తుంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, డైరెక్టర్ అయినా, నిర్మాత అయినా… కంగనా అస్సలు భయపడదు. తను చెప్పాలనుకున్న చెప్పి తీరుతుంది. ఇపుడూ వివాదాలతో స్నేహం చేస్తూనే మరోపక్క వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ భామ. తాజాగా ఈమె డైరెక్షన్లో ‘మణికర్ణిక’ డీసెంట్ హిట్ అందుకుంది. అయితే ఈ చిత్రానికి చాలా వరకూ క్రిష్ డైరెక్షన్ చేసాడు. చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

దీంతో ఇప్పుడు మరో చారిత్రక చిత్రాన్ని రూపొందించే ఆలోచనలో కంగనా ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కంగనా ప్రధాన పాత్రధారిగా నటించే ఈ చిత్రానికి తనే పూర్తి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనుందట. బడ్జెట్ పరంగా .. తారాగణం పరంగా .. గ్రాఫిక్స్ పరంగా ఈ చిత్రం ‘బాహుబలి’ .. ‘పద్మావత్’ లను మించే ఉంటుందని కంగనా చెబుతుంది. ఇప్పటీకే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోయాయట. ప్రస్తుతం కంగనా చేస్తోన్న సినిమాలు పూర్తయిన వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పై దృష్టి దృష్టిపెడతానంటుంది ఈ భామ.

Share.