ఒక్కో హీరోలో ఒక్కో స్పెషల్ క్వాలిటీ

సినిమా రంగంలో నిలబడాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో హీరోకి ఒక్కో స్పెషాలిటీ ఉంది. అందుకే వారు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఆ క్వాలిటీస్ ఏమిటంటే.. ?

మహేష్ బాబు (అందం )Mahesh Babuటాలీవుడ్ అందగాడు మహేష్. ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం పెరుగుతుంది. కానీ రాజకుమారుడు చిత్రం నుంచి సినిమాకి సినిమాకి అందాన్ని పెంచుకుంటున్నారు మహేష్. అతనిలో అందం ఒకటి మాత్రమే కాదు. నటన, కామెడీ, పంచ్ డైలాగ్స్ ఏదైనా.. సులువుగా చేయగలరు.

రవి తేజ (ఎనర్జీ)Ravi Tejaరవి తేజ అనగానే గుర్తొచ్చేది ఎనర్జీ. ప్రతి పాత్రని ఎంతో ఉత్సాహంగా చేస్తారు. తన జోష్ తో క్యారెక్టర్ కి పవర్ ఇస్తారు.

పవన్ కళ్యాణ్ (శక్తి )Pawan Kalyanపవన్ కళ్యాణ్ గొప్ప నటుడు కాదు. అలాగే అదిరిపోయే స్టెప్పులు వేయలేరు. కానీ అతనిలో ఉండే క్వాలిటీ వైబ్రన్స్. చూసేవారు అతని పాత్రలోకి లీనమయి ఊగిపోయేలా చేయడం పవన్ ప్రత్యేకత. ఆ శక్తితోనే యువతని ఆకర్షించారు.

చరణ్ (కళ్లు)Ram Charanరామ్ చరణ్ కి ఉన్న బలం కళ్లు. ఆ కళ్ళతోనే అన్ని రసాలు పలికించగలరు. ఇంకా కోపంతో చూసే చూపు విలన్ గుండెల్లో రైలు పరిగెత్తేలా చేస్తుంది. అందుకే అతని యాక్షన్ సీన్స్ అంతలా ఆకట్టుకుంటాయి.

ప్రభాస్ (పర్సనాలిటీ )Prabhasప్రభాస్ ని నిలబెట్టిన ప్రత్యేకత ఫిజిక్. ఎత్తుకి తగ్గట్టు బాడీని కంట్రోల్ చేస్తుంటారు. బాహుబలి లో అయితే సిక్స్ ప్యాక్ చూపించి దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు.

బన్నీ (స్టయిల్ )Allu Arjunఇతను హీరోనా అన్నవాళ్ళు సైతం ఆశ్చర్యపోయేలా అల్లు అర్జున్.. సినిమాకి సినిమాకి ఒక స్టైల్ ని చూపిస్తూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.

ఎన్టీఆర్ (నటన)NTRనేటి తరం హీరోల్లో అన్ని రకాల పాత్రలు అవలీలగా పోషించగల నటుడు ఎన్టీఆర్. ఆ విషయాన్నీ జై లవకుశ సినిమాలో మూడు పాత్రలను అద్భుతంగా పోషించి తాతకి తగ్గ మనవడిని అనిపించుకున్నారు.

Share.