సాహో సెట్స్ కి సడన్ విజిట్ ఇచ్చిన సూపర్ స్టార్

కేవలం తమిళనాట మాత్రమే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ఈగో లేని కథానాయకుడు అంటే అందరికీ గుర్తొచ్చేది అజిత్ ఒక్కడే. తన పేరు మీద అభిమాన సంఘాలను మూయించడమే కాక.. సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటూ వస్తున్న అజిత్.. ఇటీవల మన ప్రభాస్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడట. ప్రస్తుతం హిందీ సినిమా “పింక్” రీమేక్ లో నటిస్తున్న అజిత్ ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతుండగా.. పక్కనే ప్రభాస్ సాహో షూట్ జరుగుతుందని తెలుసుకొని తానే స్వయంగా వచ్చి ప్రభాస్ ను కలిశాడట. అజిత్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన ప్రభాస్.. తన సినిమా సెట్ లోకి అజిత్ వచ్చేసరికి షాక్ అయ్యాడట.

కొన్ని గంటలపాటు వారిద్దరు కూర్చుని తమ సినిమాల గురించి చర్చించుకొన్నారని, అలాగే అజిత్ మంచి భోజన ప్రియుడు కావడంతో ప్రభాస్ చాలా వెరైటీస్ తెప్పించి స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేశాడని కూడా తెలిసింది. ఇద్దరూ కలిసి చాలా ఫోటోలు తీసుకొన్నప్పటికీ.. ఏదైనా స్పెషల్ ఆకేషన్ లో రిలీజ్ చేయడం కోసం ప్రస్తుతానికి వాటిని విడుదల చేయడం లేదట. ఆ ఫోటోలు బయటకి ఎప్పుడు వస్తాయా అని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share.