నిజమైన జోగేంద్ర పాత్రధారి రాణా కాదంట…

నిన్న విడుదలైన మూడు సినిమాల్లో అన్నీ వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తూ ఊహించని స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న చిత్రం “నేనే రాజు నేనే మంత్రి”. రానా పెర్ఫార్మెన్స్, తేజ దర్శకత్వ ప్రతిభ, కాజల్ అభినయ సామర్ధ్యం, లక్ష్మీ భూపాల్ పవర్ ఫుల్ డైలాగ్స్ తర్వాత బాగా ఫేమస్ అయినది అనూప్ రూబెన్స్ సంగీత సారధ్యంలో రూపొందిన “జోగేంద్ర.. జోగేంద్ర” అనే టైటిల్ సాంగ్, ఈ పాట మాత్రమే కాక పాట చిత్రీకరణ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది.

అయితే.. ఈ పాట గురించి ఇవాళ జరిగిన “నేనే రాజు నేనే మంత్రి” సక్సెస్ మీట్ లో చిత్ర దర్శకుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఈ “జోగేంద్ర.. జోగేంద్ర” అనే పాటను విక్టరీ వెంకటేష్ కోసం కొన్నేళ్ళ క్రితమే రెడీ చేసిన ట్యూనట. ఈ విషయాన్ని దర్శకుడు తేజా రివీల్ చేయగానే, రానా మొదలుకొని స్టేజ్ పై ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తేజతోపాటు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కు కూడా తెలుసట. అలా బాబాయ్ సాంగ్ తో అబ్బాయి హిట్ కొట్టేశాడన్నమాట!


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.