ఆఫర్ల కోసం టాప్ లెస్ ఫోజులివ్వాల్సిన అవసరం లేదు

హీరోయిన్లు సరైన ఆఫర్లు అందిపుచుకోలేకపోతున్నప్పుడు తమ సోషల్ మీడియా ఎకౌంట్స్ లో రకరకాల హాట్ ఫోజులతో మాంచి ఫోటోలు పెడుతుంటారు. ఆల్మోస్ట్ ఖాళీగా ఉన్న ప్రతి హీరోయిన్ చేసే పని అదే. కొందరు వాళ్ళ లిమిట్ లో ఉండి కేవలం నడుమందాలు మాత్రం ఎరగా వేస్తే.. ఇంకొందరు మాత్రం యద లోతులను బహిర్గత పరుస్తుంటారు. ఈ కోవలోకి ట్యాక్సీవాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కూడా వచ్చి చేరింది. ట్యాక్సీవాలా సినిమా విడుదలై ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకూ అమ్మడికి మరో సినిమా ఆఫర్ లభించలేదు. దాంతో అమ్మడు కొన్నాళ్లుగా రకరకాల ఫోటోలు పోస్ట్ చేస్తూ లైమ్ లైట్ లో ఉండడానికి నానా తంటాలు పడుతోంది.

priyanka-jawalkar-openups-about-her-movie-offers1

ఆ తంటాలు సరిపోవన్నట్లు ప్రియాంక జవాల్కర్ రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటోను కొందరు నెటిజన్లు “టాప్ లెస్ ఫోటో” అని తేల్చేయడం పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది ప్రియాంకకు. నిజానికి ఆ ఫోటో టాప్ లెస్ కాదు, గౌన్ వేసుకొన్నాను అని ప్రియాంక రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫోటో ఇష్యూ పక్కన పెడితే.. ట్యాక్సీవాలా లాంటి హిట్ సినిమా తర్వాత కూడా ప్రియాంక ఇప్పటివరకూ మరో సినిమా సైన్ చేయకపోవడం గమనార్హం. మరి అమ్మడు తన నెక్స్ట్ సినిమా ఎప్పుడు సైన్ చేస్తుందో చూడాలి.

Share.