షూటింగ్ స్పాట్ లో మందు తాగి మైకంలోనే నటించిందట!

వచ్చేవారం విడుదలకు సిద్ధమవుతున్న “టాక్సీవాలా” చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కానున్న మన తెలుగమ్మాయి.. అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ “టాక్సీవాలా” సెట్స్ లో తాగి రచ్చ రచ్చ చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పడం విశేషం. అయితే.. ఆమె తాగింది మదమెక్కి కాదు సినిమాలోని ఒక సన్నివేశం కోసం. ఒక పర్టీక్యులర్ సీన్ లో ప్రియాంక జవాల్కర్ తాగేసినట్లుగా నటించాల్సి వచ్చింది. తాగకుండా ఎన్నిసార్లు చేసినా సీన్ వర్కవుట్ అవ్వలేదట. దాంతో.. నిజంగానే తాగి ఆ సీన్ లో నటించిందట. ఆ సీన్ తీస్తున్నన్ని రోజులు ఆమె తాగుతూనే ఉందట.

రెండేళ్ల క్రితం నుంచి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధం కాకముందే విడుదలై నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. రిలీజ్ అయ్యింది రఫ్ కట్ కాబట్టి, ఇప్పుడు ఫ్రెష్ గా కట్ చేసి ఒక డిఫరెంట్ వెర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రం మీద హీరో విజయ్ దేవరకొండ కంటే హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఎక్కువ ఆశలు పెట్టుకొంది. మరి ఆమె ఆశ తీరుతుందో లేదో అక్టోబర్ 17న తెలిసిపోతుంది.

Share.