‘సైరా’ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచిన మిల్కి బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఇది మెగాస్టార్ కు 151 వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్లు నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. అలాగే ఈ చిత్రంలో రాజనర్తకి పాత్ర అత్యంత కీలకమైనది. ఆ పాత్రలో మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా నటిస్తుంది.

తమన్నా పాత్ర కోసం సుస్మిత సుమారు 500 మంది డిజైనర్స్ సలహాలు తీసుకుని లెహంగాని డిజైన్ చేసిందట. తమన్నా,చిరంజీవిలకి మద్యే వచ్చే రొమాంటిక్ సాంగ్ లో ఈ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఈ విషయాన్ని `కామోషి` (తెలుగు-తమిళం) ప్రమోషన్లలో తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా మాట్లాడుతూ… “నేను ఎందరో కాస్ట్యూమ్ డిజైనర్లతో పని చేశాను. కానీ సుశ్మిత డిజైనింగ్ స్టైల్ .. క్రియేటివిటీ.. డెడికేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. రాజనర్తకి పాత్ర కోసం అద్భుతమైన కాస్ట్యూమ్ ని డిజైన్ చేశారు. సైరా 18వ శతాబ్దపు రోజులల్లోకి తీసుకెళుతుంది.. ‘బాహుబలి’ తరువాత కాస్ట్యూమ్స్ విషయంలో నిజమైన రాయల్ టచ్ ఉన్న చిత్రం” అంటూ చెప్పుకొచ్చింది.

Share.