ఎన్టీఆర్ కి నో చెప్పింది… బన్నీకి ఒకే చెప్తుందా..?

గతంలో ఓ వెలుగు వెలిగిన కొందరి హీరోయిన్లని తన సినిమాల్లో ఏది ఒక పాత్ర ఇచ్చి ఫేమస్ చేస్తుంటాడు స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. నదియా,స్నేహ,సింధు తులాని, కుష్బు, దేవయాని, ఇంద్రజ వంటి సీనియర్ హీరోయిన్లని తన సినిమాల్లో మంచి పాత్రలిచ్చి వారిని మరింత పాపులర్ చేసాడు. ఇప్పుడు మరో హీరోయిన్ ని మళ్ళీ తెలుగు తెరకు తీసుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఆ నటి మరెవరో కాదు టబు. తెలుగులో దాదాపు అందరి హీరోల సరసన నటించింది టబు. ప్రస్తుతం బాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్న టబును త్వరలోనే మళ్ళీ టాలీవుడ్ కి తీసుకురాబోతున్నాడట.

వివరాల్లోకి వెళితే… అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించి దాదాపు 3 నెలలు పూర్తవుతున్నా.. ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ నటి టబు ని తీసుకోవాలని సంప్రదింపులు మొదలుపెట్టాడట త్రివిక్రమ్. ఈ చిత్రంలో బన్నీ తల్లిగా టబు పాత్ర ఉండబోతుందట. గతేడాది ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ కి తల్లి పాత్ర కోసం టబు ని సంప్రదించగా… పాత్రలో డెప్త్ లేకపోవడంతో ఆమె రిజెక్ట్ చేసిందట. దాంతో ఆ పాత్రకి దేవయాని ని తీసుకున్నాడు. ఇప్పుడు బన్నీ చిత్రం కోసం మరోసారి టబు ని సంప్రదిస్తున్నాడు త్రివిక్రమ్. మరి ఈసారైనా ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Share.