మెగాస్టార్ ను ఇంత పవర్ ఫుల్ గా ఎప్పుడూ చూడలేదు!

“ఖైదీ నెం.150″తో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అనే విషయాన్ని ఆ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ తో ప్రూవ్ చేశారు. తన చిరకాల కోరిక అయిన మొదటి సాయుధ స్వతంత్ర పోరాట యోధుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవితం ఆధారంగా తెరకెక్కే బయోపిక్ ను తన 151వ సినిమాగా ఎంచుకొన్నారు. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బయోపిక్ ను రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 2న తెలుగుతోపాటు తమిళ, హిందీ, మళయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకానున్న ఈ చిత్రం టీజర్ ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని ఇవాళ విడుదల చేశారు.

Chiranjeevi, Amitabh Bacchan, Ram Charan, Surender Reddy, Sye Raa Movie, Sye Raa Narasimha Reddy Movie

పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ టీజర్ లో మెగాస్టార్ కి ఇచ్చిన ఎలివేషన్స్ మాములుగా లేవు. షూటింగ్ కి ఎందుకింత సమయం పట్టింది అనే ప్రశ్నకు టీజర్ తోనే సమాధానం చెప్పారు చిత్రబృందం. రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ ను మాత్రం మెచ్చుకోవాలసిందే. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా, రిచ్ గా ఉంది. రామ్ చరణ్ ప్రొడక్షన్ వేల్యూస్ పాన్ ఇండియా రేంజ్ లో ఉన్నాయి. టీజర్ తోనే సినిమా మీద విశేషమైన అంచనాలను పెంచేసాడు సురేంద్ర రెడ్డి. టీజర్ రేంజ్ లో సినిమా కూడా ఉంటే.. అక్టోబర్ 2న తెలుగు సినిమా ప్రేక్షకులు మరోసారి కాలర్ ఎగరేయొచ్చు.

Share.