‘మా’ లో మళ్ళీ మొదలైన రచ్చ… రాజీనామా చేసిన దర్శకుడు కృష్ణారెడ్డి..!

తాజాగా సీనియర్ దర్శకుడు ఎస్వీ.కృష్ణారెడ్డి ప్యానెల్ లో ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. దీంతో ‘మా’ లో మళ్ళీ రచ్చ మొదలయినట్టయ్యింది. దీనికి అసల కారణం ఏంటనేది అయన తెలుపలేదు. అయితే నిధుల దుర్వినియోగం వల్లే అయన రాజీనామా చేసాడని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. కృష్ణారెడ్డి శివాజీరాజా ప్యానెల్ నుండే ఎన్నికల్లో గెలిచారు.అనంతరం కమిటీతో కలిశారు కూడా. అయితే ఇప్పుడు ఎందుకు ప్యానెల్ లో పదవికి రాజీనామా చేశారనేది చర్చనీయాశంగా మారింది.

ఇప్పటికే ‘మా’ లో చాలా గొడవలు జరుగుతున్నాయనే టాక్ ఉంది. రహస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాల్ని కూడా ఇలా ఎందుకు బయట పెట్టి.. ఇలా అల్లర్లు ఎందుకు చేస్తున్నారని అక్కడ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా శివాజీ రాజా ప్యానెల్ అలాగే నరేష్ ప్యానెల్ ల మధ్య వివాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మరి దీని పై ‘మా’ ఎటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి…!

Share.