సక్సెస్ కు రూటు చూపిస్తున్న క్రైమ్

టాలీవుడ్ లో ట్రెండ్ అనేది ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుంటుంది. గతంలో సిస్టర్ సెంటిమెంట్ తో కూడుకున్న సినిమాలు వచ్చేవి కొన్నాళ్ళు ఆ ట్రెండ్ నడిచింది. ఆ తరువాత కుటుంబ కథా చిత్రాలు వచ్చేవి వాటికి ఇప్పటికీ ఆదరణ ఉందనుకోండి..! ఇక అటుతరువాత హీరో ఫ్లాష్ బ్యాక్ డ్రామాతో సినిమాలు వచ్చేవి. తమిళ డబ్బింగ్ చిత్రమైనా ‘బాషా’ తోనే ఈ ట్రెండ్ మొదలైంది. దీనిని కంటిన్యూ చేస్తూ ‘సమరసింహా రెడ్డి’ ‘నరసింహ నాయుడు’ ‘మాస్టర్’ ‘ఇంద్ర’ అబ్బో ఇలా చెప్పుకుంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇక ఇది కూడా రొటీన్ అయిపోయింది అనుకున్న సమయంలో శ్రీను వైట్ల కామెడీ జోనర్ సినిమాల ట్రెండ్ కూడా వచ్చింది. వరుస పెట్టి అదే ఫార్ములాని చాలా మంది డైరెక్టర్లు వాడేశారు.

agent-sai-srinivas-athreya-movie-review5

ఇక ప్రస్తుతం అయితే సస్పెన్స్ తో కూడు కున్న క్రైమ్ థ్రిల్లర్ల ట్రెండ్ ఎక్కువ నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ ‘బ్రోచేవారెవరురా’ ‘రాక్షసుడు’ ‘ఎవరు’ వంటి చిత్రాలను బట్టి ఈ విషయాన్ని బలంగా చెప్పొచ్చు. ఈ మూడు చిత్రం ‘క్రైమ్’ అంశంతోనే తిరుగుతాయి. అలా అని అన్నీ క్రైమ్ జోనర్ లో వచ్చే సినిమాలు హిట్టవుతాయని చెప్పలేము. రెండున్నర గంటలు ఆ పాయింట్ ను ఇంటెస్టింగ్ గా చెప్పి ఎంగేజ్ చేసే దర్శకులకే విజయాలు దక్కుతున్నాయి. అలాంటి సినిమాలతో లాభాల బాట పడుతున్నారు మన దర్శక నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు.

1

brochevarevarura-movie-review5

2

rakshasudu-movie-review5

3

evaru-movie-review4

Share.