నాన్నతో జ్ఞాపకాలను పంచుకున్న సుశాంత్

అక్కినేని నాగార్జున మేనల్లుడు, యువ హీరో సుశాంత్‌ తండ్రి అనుమోలు సత్యభూషణ్‌రావు ని చాలా మిస్ అవుతున్నానని చెప్పారు. ఆయన మొన్న రాత్రి గుండె పోటుతో కన్నుమూశారు. అక్కినేని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయి ఉండగా.. ఆ బాధను, అతనితో ఉన్న జ్ఞాపకాలను సుశాంత్ సోషల్ మీడియా వేదిపై పంచుకున్నారు. ‘‘మా నాన్న మనసున్న సరదా మనిషి. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఆయన జీవితమంతా స్నేహితులు, కుటుంబంతో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలే ఉన్నాయి.

అవి ఎప్పటికీ పదిలంగానే ఉంటాయి. ఇప్పుడు ఆయనకి ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం గడపాల్సిన సమయం వచ్చింది. మేమంతా నాన్నని చాలా మిస్సవుతున్నాం. ఆయన జీవితంలో మేమంతా ఓ భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మాతో ఉంటూ ధైర్యానిస్తున్న కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులు ఉండడం మా అదృష్టం. అందరికీ ధన్యవాదాలు. లవ్యూ నాన్నా’’ అంటూ సుశాంత్‌ చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. అలాగే అఖిల్ కూడా సత్యభూషణ్‌రావు మామ ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.