అంత కొత్తగా అయితే ఏమీ లేదు, సినిమా ఎలా ఉంటుందో?

ఇదివరకు పోలిటికల్ ఎంటర్ టైనర్స్ అంటే జనాలకు కాస్త ఆసక్తి ఉండేది. కానీ.. ఈమధ్యకాలంలో వరుసబెట్టి పోలిటికల్ ఫిలిమ్స్ వస్తుండడంతో పోలిటికల్ సినిమాలను కూడా ఎంటర్ టైన్మెంట్ సినిమాల్లానే చూస్తున్నారు జనాలు. అలాంటి తరుణంలో ఒక పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమా జనాలని అలరించాలంటే రాజకీయ నేపధ్యం ఉంటే సరిపోదు వైవిధ్యమైన కథనం కూడా ఉండాలి. కానీ.. నిన్న విడుదలైన సూర్య కొత్త సినిమా “ఎన్.జి.కె” ట్రైలర్ లో మాత్రం ఈ వైవిధ్యం అనేది ఎక్కడా కనిపించలేదు.

ngk-movie-trailer-review1

ngk-movie-trailer-review2సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికలుగా నటిస్తుండగా మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిన్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. టీజర్ తో క్రియేట్ అయిన కనీస స్థాయి ఇంపాక్ట్ కూడా ట్రైలర్ లో లేకపోవడం గమనార్హం. ఒక రెగ్యులర్ పోలిటికల్ సినిమా లాగే అనిపించింది తప్పితే ఎక్కడా కూడా సెల్వ రాఘవన్ మార్క్ కానీ.. వైవిధ్యం కానీ కనిపించలేదు. దాంతో ఈ సినిమా మీద అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. మరి సెల్వ రాఘవన్ రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాడో లేదో చూడాలి.

Share.