ఉయ్యాలవాడకు పూనకాలు తప్పవు…రెడీగా ఉండండి!!

టాలీవుడ్ లో కొందరు దర్శకులు అదే పనిగా బడా హీరోలను పోగుడుతూ ఉంటారు…అయితే ఆది సంధర్భానుసారంగా కావచ్చు…లేదా తమ మనసులోని అభిమానం అయినా అయి ఉండవచ్చు…మ్యాటర్ లోకి వెళితే…మెగాస్టార్ పై తన అభిమానాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు మన క్రియేటివ్ దర్శకుడు సుకుమార్…మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఉయ్యాలవాడ నర సింహరెడ్డి సినిమాపై ఆయన మాట్లాడాడు…ఎక్కడ? ఎప్పుడు అంటే ఒకసారి ఈ మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది…అసలు విషయంలోకి వెళితే…సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న మెగా 151 ఉయ్యాలవాడ సినిమా మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని అంటున్నాడు డైరక్టర్ సుకుమార్. తన నిర్మాణంలో వస్తున్న దర్శకుడు సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రస్తావన తెచ్చాడు సుకుమార్.

ఆ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తాను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని కాకపోతే తన ఆర్య సినిమా సురేందర్ రెడ్డి అతనొక్కడే కన్నా ఓ సంవత్సరం ముందు రిలీజ్ అయ్యిందని అన్నారు. ఇక అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయ్యిందని. ప్రస్తుతం చేయబోయే ఉయ్యాలవాడ కథ చెబుతుంటే రంగస్థలం సెట్స్ లో అందరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నాడు సుకుమార్. ప్రతి ఎపిసోడ్ చాలా ఎక్సైటింగ్ గా అనిపించిందని అన్నారు. కచ్చితంగా మెగాస్టార్ 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా మెగా ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా ఉంటుందని అన్నారు. మొత్తంగా చూసుకుంటే మెగా 151 ఫ్యాన్స్ కి పండగ తెస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు…ఏది ఏమైనా…మెగాస్టార్ అంటే మెగాస్టారే మరి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.