ఎన్టీఆర్ మహానాయకుడు ఎట్టి పరిస్తితులో హిట్ అవ్వాల్సిందే

ఎన్టీఆర్ కథానాయకుడు ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచిందనే బాధకంటే.. తనకంటే జూనియర్స్ అయిన నాగ అశ్విన్, మహి వి.రాఘవ్ లాంటి దర్శకుడు బయోపిక్ లతో సూపర్ హిట్స్ అందుకున్నారన్న బాధే ఎక్కువగా కనిపిస్తోంది క్రిష్ లో. సావిత్రీ జీవితం ఆధారంగా నాగ అశ్విన్ తెరకెక్కించిన “మహానటి” 2018 బిగ్గెస్ట్ హిట్స్ లో నిలవడమే కాక నిర్మాతకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇక గతవారం విడుదలైన “యాత్ర” కూడా హిట్ టాక్ తెచ్చుకోవడమే కాక.. మొదటి వారానికే డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ సేఫ్ జోన్ లో పడేసింది. దాంతో ఆల్రెడీ సినిమాను సూపర్ హిట్ గా డిక్లేర్ చేసేశారు.

దాంతో క్రిష్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ “ఎన్టీఆర్ మహానాయకుడు”తో సూపర్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఫిబ్రవరి 8న విడుదలకావాల్సిన సినిమాను పోస్ట్ పోన్ చేసిన చాలా సీన్స్ రీషూట్ చేసిన క్రిష్.. ఇప్పటికీ మెరుగులు దిద్దుతూనే ఉన్నాడు. పైగా.. కొన్ని కొత్త సన్నివేశాలు కూడా యాడ్ చేశాడు క్రిష్. ఒక ఫిలిమ్ మేకర్ గా క్రిష్ కి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ.. కథానాయకుడు విషయంలో మాత్రం స్క్రీన్ ప్లే పరంగా కొన్ని తప్పులు చేశాడు. ఆ తప్పులను మహానాయకుడుతో సరిదిద్దుకుంటాడో లేదో చూడాలి.

Share.