యాక్సిడెంట్ లో మరణించిన సెలబ్రిటీలు

నటీనటులు తమ నటనతో ఎంతోమందిని అభిమానులుగా చేసుకుంటారు. ఆ అభిమానులు తమకు నచ్చిన తారను ఇంట్లో కుటుంబ సభ్యులుగా భావిస్తుంటారు. వారికి విజయం వస్తే సంబరపడుతారు. వారికి కష్టమొస్తే దుఃఖిస్తారు. ఆ విధంగా ఆరాధించే వ్యక్తులు దూరమైతే తట్టుకోలేరు. ఫ్యాన్స్ కళ్ళలో కన్నీటిని మిగిల్చి హఠాత్తుగా ప్రమాదంలో మరణించిన సెలబ్రిటీల గురించి..

తరుణి సచ్ దేవ్ Taruni Sachdevరస్నా పాప గా దేశం మొత్తం తెలిసిన తరుణి సచ్ దేవ్, అమితాబ్ బచ్చన్ తో పా సినిమాలో నటించి చిన్న వయసులోనే అభిమానులను సొంతం చేసుకుంది. 14 ఏళ్లకే దాదాపు 50 వాణిజ్య ప్రకటనల్లో కనిపించిన తరుణి నేపాల్లో జరిగిన విమాన ప్రమాదంలో ఈ లోకానికి దూరమయింది.

యశో సాగర్ Yasho Sagarఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా యశో సాగర్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మిస్టర్ ప్రేమికుడు, అయ్యో పవన్.. అనే సినిమాలకు సైన్ చేశారు. అయితే కర్ణాటక హైవే లో కారులో వస్తుండగా ప్రమాదం జరిగి యశో సాగర్ చనిపోయారు.

జస్పాల్ బట్టి Jaspal Bhattiఉల్టా పల్టా, ఫ్లాప్ షో అనే హాస్య కార్యక్రమాల ద్వారా జస్పాల్ బట్టి దేశం మొత్తం అభిమానులను ఏర్పరుచుకున్నారు. సినిమాల్లో అవకాశాలు పట్టి హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2012 లో తన సినిమా పవర్ కట్ ప్రచారంలో భాగంగా జలంధర్ కి వెళ్లి వస్తుంటే కారు ప్రమాదం జరిగింది. భారీ గాయాలతో కొన్ని రోజులు జస్పాల్ బట్టి పోరాడిన ఫలితం లేకుండా పోయింది. నవ్వుల్ని ఇక్కడ వదిలిపెట్టి ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు.

సౌందర్య Soundaryaతెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం చేయనవసరం లేని పేరు సౌందర్య. అందం, అభినయంతో తెలుగువారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ నటి 2004 ఎన్నికల ప్రచార నిమిత్తం హెలికాఫ్టర్ లో వస్తుండగా ప్రమాదం జరిగి అక్కడికక్కడే మరణించారు. ఫ్యాన్స్ చివరి చూపు చూసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

ఆనంద్ అభ్యంకార్, అక్షయ్ పెండ్సే Anand Abhyankarమరాఠి చలన చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న నటులు ఆనంద్ అభ్యంకార్, అక్షయ్ పెండ్సే . బుల్లితెర ప్రేక్షకులకు కూడా వీరిద్దరూ బాగా పరిచయం. వీరిద్దరూ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొని కారులో వస్తుండగా ముంబై పూణే ఎక్స్ ప్రెస్ వే పై ఘోర రోడ్ ప్రమాదం జరిగింది. ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మరాఠి చిత్ర పరిశ్రమ గొప్ప నటులను కోల్పోయింది.

Share.