ప్రొడక్షన్ బాధ్యతలను తీసుకుంటున్న అందాల తారలు!

సినిమా విభాగాల్లో అత్యంత క్లిష్టమైంది ప్రొడక్షన్ విభాగం. తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలో అంజలి దేవి, భానుమతి, సావిత్రిలు సినిమా మేకింగ్ లో అడుగుపెట్టి విజయాలను, అపజయాలను చవిచూశారు. ఆ తర్వాత అటువైపు ఎవరూ వెళ్ళలేదు. వచ్చామా.. నాలుగు స్టెప్పులు వేశామా.. రెమ్యునరేషన్ తీసుకొని వెళ్లిపోయామా.. అనే విధంగానే ఉండేవారు. ఇదే సేఫ్ గేమ్ కూడా. కానీ నేటి తారలు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడం లేదు. సంపాదించిన సొమ్మును సినీ నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఖుషి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న భూమిక  తకిటతకిట చిత్రాన్ని నిర్మించింది.

ఈ మూవీ నిరాశపరిచినప్పటికీ మరి కొంత మంది హీరోయిన్లు నిర్మాతలు గా మారడానికి సై అంటున్నారు. వారే సమంత, త్రిష. కన్నడ సినిమాను తెలుగులో రీమేక్ చేసే పనిలో సమంత ఉండగా, త్రిష మంచి కథ కోసం చూస్తోంది. హీరోయిన్ గా రాణించిన వీరిద్దరూ నిర్మాతగా సక్సస్ అవుతారో లేదో కాలమే చెప్పాలి.

Share.