అన్నగారి వాయిస్ ను ‘యాజ్ ఇట్ ఈజ్’ దించేసాడు..!

‘ఎన్టీఆర్ బయోపిక్’ అంటూ ఇప్పటికే మూడు సినిమాలొచ్చాయి. వీటిలో మొదటి రెండూ స్వయంగా ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణే నటించి, నిర్మించాడు. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ ఏమాత్రం సెట్ కాలేదనే విమర్శలొచ్చాయి. ఆ సినిమాలో ఎన్టీఆర్ అసలు కనిపించలేదని… బాలకృష్ణే కనిపించాడని ప్రేక్షకులు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో ఎన్టీఆర్ పాత్ర పోషించిన విజయ్ కుమార్ మాత్రం అచ్చు గుద్దినట్టు అలానే దిగిపోయాడు. ఫస్ట్ లుక్ చూసినప్పటి నుండే ఈ చిత్రం పై క్రేజ్ ఏర్పడడానికి ఇదో కారణమని చెప్పుకోవచ్చు.

అసలు ఈ పాత్రని ఎక్కడినుండీ పట్టుకొచ్చాడో కానీ.. నిజమైన ఎన్టీఆర్ ని తీసుకొచ్చేసాడు వర్మ అంటూ ప్రేక్షకులు తెగ ప్రశంసిస్తున్నారు. ఓ రంగస్థల నటుడి విజయ్ కుమార్ లో అందరూ ఎన్టీఆర్ ని చూసారు. తాజాగా విజయ్ కుమార్ ఒరిజినల్ ఫోటోను కూడా ఇటీవల తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసాడు వర్మ. ఇక విజయ్ కుమార్ కు డబ్బింగ్ చెప్పిందెవరో తెలుసా..? ‘అతడు’ సినిమాలో ‘బెదరక బదులే చెప్పేటి తెగువకు కోడతడే’ వంటి సూపర్ హిట్ పాటను రాసిన విశ్వ.. ఎన్టీఆర్ పాత్రకు డబ్బింగ్ చెప్పినట్టు వర్మ తెలియజేసాడు. విశ్వ ‘అతడు’తో పాటు మరికొన్ని సినిమల్లో పాటలు రాశాడు.

star-writer-given-voice-for-sr-ntr-in-lakshmisntr-movie1

ఆలపించాడు. ఐతే కొన్నేళ్లుగా అతను లైమ్ లైట్లో లేడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర కి వాయిస్ చూసి ఎవరో మిమిక్రీ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించి ఉంటారని అందరూ అనుకున్నారు కానీ ఆ వాయిస్ విశ్వది అని వర్మ వెల్లడించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ వాయిస్ విశ్వ చాలా బాగానే చెప్పాడు. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఈ వాయిస్ గురించి మాట్లాడుకుంటున్నారంటే.. విశ్వ ఎంత సహజంగా చెప్పాడో స్పష్టమవుతుంది. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఒక రియాలిటీ బేస్డ్ సినిమా తీయాలంటే అది రాంగోపాల్ వర్మ మాత్రమే అని ప్రేక్షకులు వర్మని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Share.