సమ్మర్ ను సరిగా వినియోగించుకోలేకపోయిన టాలీవుడ్

సంక్రాంతి, దసరా తర్వాత భాషతో సంబంధం లేకుండా ఏ ఇండస్ట్రీకైనా కామన్ గా దొరికే బిగ్గెస్ట్ హాలీడే సీజన్ సమ్మర్. ఈ సీజన్ కోసం పెద్ద హీరోలు పోటీ పడరు కానీ.. యంగ్ & మీడియం రేంజ్ హీరోలు మాత్రం కాస్త గట్టిగానే ట్రై చేస్తారు. ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీగా ఉన్న స్టూడెంట్స్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏదైనా సినిమా బాగుంది అంటే కుటుంబం మొత్తం వెళ్లిపోతుంటారు. అలాంటి సమ్మర్ సీజన్ ని మన టాలీవుడ్ ఈసారి పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది. గడిచిన రెండు నెలల్లో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా విడుదలవ్వలేదు. అలాగే విడుదలైన సినిమాల్లో ఆకట్టుకొన్న సినిమా ఒక్కటీ లేదు.

మే, ఏప్రిల్ నెలల్లో మంచి హిట్ కొట్టిన తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. మధ్యలో వచ్చిన “ఫలక్ నుమా దాస్” మొదటివారం కాస్త హడావుడి సెకండ్ వీక్ కి వీక్ అయిపోయింది. ఇక వచ్చేవారం కానీ ఆ వచ్చే వారం కానీ పెద్ద సినిమా ఒక్కటి కూడా లేదు. దాంతో జూన్ కూడా పోయినట్లే. ఆ విధంగా మన టాలీవుడ్ పెద్దలు సక్సెస్ ఫుల్ గా ఒక సమ్మర్ ను వేస్ట్ చేసుకొన్నారన్నమాట. ఇలా జనాలు సినిమాల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు విడుదల చేయకుండా.. వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నప్పుడు ఒకేసారి అయిదారు సినిమాలు రిలీజ్ చేసి ఏం సాదిద్దాం అనుకొంటున్నారో ఎవరికీ అర్ధం కానీ విషయం.

Share.