ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఇచ్చిన స్టార్ హీరోస్

హీరోగా ఎదిగిన తర్వాత మరో హీరో సినిమాలో నటించడానికి అనేక సమస్యలు ఉంటాయి. కథ నచ్చాలి, పాత్ర నచ్చాలి.. ఎక్కువ నిడివి ఉండాలనే కండిషన్లు మల్టీ స్టారర్ సినిమాలకు అడ్డుగా మారతాయి. అసలు కనిపించకుండా నటిస్తే.. అదేనండీ వాయిస్ ఓవర్ ఇస్తే.. ఇవేమీ అడ్డురాదు. అందుకే తెలుగు చిత్రపరిశ్రమలో చాలామంది స్టార్ హీరోలు ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అటువంటి సినిమాలపై ఫోకస్..

సునీల్ Sunilహాస్య నటుడి నుంచి హీరోగా ఎదిగిన సునీల్ అందరికంటే ఎక్కువ సార్లు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నువ్విలా, కిక్ 2 , జబర్దస్త్, రేసుగుర్రం సినిమాల్లో తన వాయిస్ తో సందడి చేశారు.

నారా రోహిత్ Nara Rohitయువ హీరో నిఖిల్ స్వామి రారా సినిమాకి నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా ప్రారంభం, క్లైమాక్స్ లో వచ్చే నారా రోహిత్ గాత్రం సినిమా విజయానికి దోహదం చేశాయి.

రవితేజ Ravi Tejaమర్యాద రామన్న సినిమాలో సైకిల్ కి రవితేజ వాయిస్ ఇచ్చారు. చాలా ఫన్నీగా ఉంటుంది. మంచు విష్ణు దూసుకెళ్తా మూవీలో కూడా రవితేజ సరదాగా వాయిస్ ఇచ్చారు.

మహేష్ బాబు Mahesh Babuపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా బాద్షాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ద్వారా కథను నడిపించారు.

చిరంజీవి Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి కూడా వాయిస్ అందించారు. రుద్రమదేవి సినిమాతో పాటు రీసెంట్ గా వచ్చిన రానా ఘాజీ మూవీలో కూడా చిరు వాయిస్ తో ఆకట్టుకున్నారు.

రాజ్ తరుణ్ Raj Tarunనాగ శౌర్య, అవికా గోరె నటించిన లక్ష్మి రావే మా ఇంటికి సినిమాకి రాజ్ తరుణ్ వాయిస్ ఇచ్చారు. అబ్బాయితో అమ్మాయి అనే చిత్రానికి కూడా రాజ్ తరుణ గాత్ర దానం చేశారు.

ఎన్టీఆర్ NTRరామ్ నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సినిమా విజయం సాధించక పోయేసరికి అప్పటి నుంచి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కి దూరంగా ఉన్నారు.

రామ్ Ramసాయి ధరమ్ తేజ్ రేజ్ సినిమాకి రామ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దర్శకుడు వైవీఎస్ చౌదరి కి రామ్ కి మధ్య అనుబంధంతో రామ్ వాయిస్ ఇవ్వడానికి ముందుకొచ్చారు.

అల్లరి నరేష్ Allari Nareshహాస్య సినిమాల కథానాయకుడు అల్లరి నరేష్ మూడు సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారు. భీమిలి కబడ్డీ జట్టు, పప్పు, వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీలో తన గొంతుతో జోష్ నింపారు.

నాని Naniనేచురల్ స్టార్ నాని తాను నిర్మాణంలో భాగం పంచుకున్న డి ఫర్ దోపిడీ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ప్రభాస్ Prabhasమంచు విష్ణు బ్లాక్ బస్టర్ మూవీ దేనికైనా రెడీ లో ప్రభాస్ అక్కడక్కడా మనకి కనిపిస్తారు.. కాదు కాదు .. వినిపిస్తారు.

Share.