పండుగల్లో స్టార్ హీరోల హంగామా

పండుగ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలు సందడి చేయడం గ్యారంటీ. ఈ సారి కూడా భారీ చిత్రాల హంగామా మిస్ కాదు. తెలుగు వారికీ విందు భిజానం పెట్టడానికి స్టార్ హీరోలు శ్రమిస్తున్నారు. దసరాకి కొంచెం ముందుగానే పైసా వసూల్ చేయడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తొలిసారి నటించిన పైసా వసూల్ సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ తొలి సారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21 న, మహేష్ బాబు మొదటి సారి చేసిన ద్వి భాషా చిత్రం స్పైడర్ సెప్టెంబర్ 27 న విడుదల కానున్నాయి.

ఇక సంక్రాంతి రెండు భారీ చిత్రాలు రానున్నాయి. వాటిలో పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ఒకటి కాగా, మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భరత్ అనే నేను మరొకటి. ఈ రెండు పెద్ద పండుగ పందెపు కోళ్లలా పోటీ పడనున్నాయి. సో దసరాకు థియేటర్ల వద్ద ఒక రకమైన పోటీ కనిపిస్తే, సంక్రాంతికి మరొకరకమైన వాతావరణం కనిపించనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.