బిగ్ బాస్ 3 కోసమే పటాస్ షో నుంచి బ్రేక్ తీసుకున్న శ్రీముఖి

పటాస్ షో నుంచి నేను బ్రేక్ తీసుకొంటున్నాను అని శ్రీముఖి ప్రకటించినప్పట్నుంచి ఆమె అభిమానులు తెగ బాధపడిపోవడం మొదలెట్టారు. సినిమాల్లోకి వెళుతోందని కొందరు, సీరియల్స్ లోకి వెళుతోందని ఇంకొందరు వ్యాఖ్యానించడంతో అసలు శ్రీముఖి “పటాస్” షో నుంచి ఎందుకు నిష్క్రమించింది అనే విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం శ్రీముఖి “బిగ్ బాస్ 3” సైన్ చేసిందని, అందుకే పటాస్ షో నుంచి బ్రేక్ తీసుకొందనీ, ప్రస్తుతం బిగ్ బాస్ షో కోసం ప్రిపేర్ అవుతోందని తెలుస్తోంది. శ్రీముఖితోపాటు గుత్తా జ్వాల కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 3 లో కనిపించనుందని. సమాచారం. మొదటి సీజన్ రేంజ్ లో సెకండ్ సీజన్ కి పెద్దగా రెస్పాన్స్ కానీ రిసెప్షన్ సరిగా రాలేదన్న విషయాన్ని గమనించిన బిగ్ బాస్ టీం ఈసారి కాస్త పాపులర్ సెలబ్రిటీలను తీసుకొస్తున్నారు. మరి ఈ మూడో సీజన్ సంగతి ఏంటో కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. మరి మన పటాస్ శ్రీముఖి ఈ సీజన్ 3 లో ఏమేరకు నెగ్గుకొస్తుందో చూడాలి.

Share.