చివరి పాటకు సిద్ధమవుతున్న స్పైడర్

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా టీజర్ ఆగస్టు 9 న రిలీజ్ అయి కోటి వ్యూస్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ మూవీ ఒక మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఆ పాటను లండన్లో ప్లాన్ చేశారు. ఈనెల 23 నుంచి రొమేనియా(యూరప్)లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. ఈ పాటకు శోభి కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ తో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లే. ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్ పనులు సాగుతున్న ఈ మూవీకి  విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ విదేశాల్లో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘దసరా పండుగని పురస్కరించుకొని సెప్టెంబర్ 27 న  స్పైడర్ ని రిలీజ్ చేస్తున్నాం.  మహేష్, మురుగదాస్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకి  మించి ఈ చిత్రం ఉండబోతోంది’’అని చెప్పారు. హరీష్ జయరాజ్ సమకూర్చిన పాటల్లో బూమ్ బూమ్ రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలోనే ఆల్బమ్ లోని మరో పాటను రిలీజ్ చేయడానికి చిత్రం బృందం సిద్ధమవుతోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.