మహేష్ సినిమాకి రెండు క్లైమాక్స్ లు షూట్ చేస్తున్న మురుగదాస్

మొన్న వియాత్నం.. నిన్న చెన్నై.. ఈరోజు హైదరాబాద్ .. ఇన్ని ప్రాంతాల్లో నాన్ స్టాప్ గా  స్పైడర్ మూవీ షెడ్యూల్ సాగుతోంది. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ నేడు హైదరాబాద్ లో మొదలయింది. భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. మురుగదాస్ ఈ చిత్రానికి రెండు రకాల క్లైమాక్స్ లు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.

కారణమేమిటంటే.. తమిళ సినీ ప్రేక్షకులు వాస్తవానికి దగ్గరగా ఉండే ముగింపుని కోరుకుంటారు. తెలుగువారు హీరోయిజాన్ని ఇష్టపడుతారు. అందుకే రెండు వర్గాల వారిని సంతృప్తి పరచడానికి డైరక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే షూటింగ్ ఎక్కువగా రోజులు సాగుతుందంట. రెండు క్లైమాక్స్ లు అయినా జూన్ 23 న సినిమా తప్పకుండా రిలీజ్ అవుతుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.