స్పైడర్ మూవీ టీజర్ | మహేష్ బాబు | రకుల్ ప్రీత్

మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పైడ‌ర్ . సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఒక్క సాంగ్ మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఆ సాంగ్ ని రొమానియాలో చిత్రీక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్‌మైంట్ సంస్థలు సంయుక్తంగా స్పైడర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో మహేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఎస్ జె సూర్య విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. హ‌రీష్‌ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్ప‌టికే స్పైడ‌ర్ చిత్రానికి సంబంధించి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుండ‌గా, విడుద‌ల త‌ర్వాత మూవీ సంచ‌ల‌నాలు సృష్టిస్తుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.