స్పైడేర్ మూవీ ఫుల్ సాంగ్స్ | మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ | హేరిస్‌ జయరాజ్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పెడర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 9న చెన్నైలో చాలా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే సెప్టెంబర్‌ 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌ 27న దసరా కానుకగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం: హేరిస్‌ జయరాజ్‌


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.