సెలెబ్రిటీలు కూడా ఇలా మోసపోతారా.. పాపం..!

తెలుగులో చిన్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది సోనాక్షి వర్మ. అయితే ఆమె ఇటీవల గుర్తు తెలియని నైజీరియన్ చేతిలో మోసపోయింది. సైబర్ నేరాలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో సెలెబ్రిటీలు కూడా ఇలా మోసపోవడం ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. కొద్ది రోజుల పరిచయానికే అవతలి వ్యక్తులని పూర్తిగా నమ్మేసి.. సోనాక్షి వర్మ మోసపోయింది. దీంతో ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది…

nigerian-cheats-actress-sonakshi-varma1

nigerian-cheats-actress-sonakshi-varma2

అసలు విషయం ఏమిటంటే.. మే నెలలో సోనాక్షివర్మ ఫేస్ బుక్ ఖాతాకు ఓ రిక్వస్ట్ వచ్చింది. మెరిన్ కిరాక్ పేరుతో ఉన్న ఆ రిక్వస్ట్ ని సోనాక్షి వర్మ యాక్సెప్ట్ చేయడంతో.. అతడు ఈమెతో చాటింగ్ మొదలుపెట్టాడు. ‘నేను లండన్ కు చెందిన వ్యక్తిని అని,. మీతో స్నేహం చేయాలని భావిస్తున్నానని’ చెప్పడంతో సోనాక్షి వర్మ నమ్మేసింది. అలా ఫేస్ బుక్ ద్వారా బాగా దగ్గరయ్యాడు ఆ వ్యక్తి. కొద్ది రోజుల తర్వాత తమ ఫ్రెండ్ షిప్ కు గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానని చెప్పాడు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుండీ నేరుగా హైదరాబాద్ లోని మీ ఇంటికి వస్తుందని ఆమెతో చెప్పాడు. మే 27న తాను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారిని అని, మెరిన్ కిరాక్ పేరుతో ఓ గిఫ్ట్ వచ్చిందని ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. ఆ గిఫ్ట్ ఇంటికి పంపాలంటే 85 వేలు ఖర్చవుతుందని ఆమెకు చెప్పాడు. అది నమ్మేసిన సోనాక్షి వెంటనే అతడు చెప్పినట్టు ఆ వ్యక్తి బ్యాంక్ ఖాతాకు 85 వేలు జమ చేసింది. కానీ ఆ గిఫ్ట్ మాత్రం ఇంటికి చేరలేదు. ఆ తర్వాత అతడికి ఫోన్ చేసినా ‘స్విచ్ ఆఫ్’ చేసి ఉంది. ఇలా తను మోసపోయిన విషయాన్ని తెలుపుతూ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది..

Share.