తమిళ, తెలుగు హీరోల్లో మ్యాచ్ అయ్యే సంగతులు

మన హీరోల గురించి తమిళంలో పెద్దగా తెలియక పోవచ్చేమో కానీ, తమిళ హీరోలు మనకి బాగా తెలిసినవాళ్లే. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. టాలీవుడ్, కోలీవుడ్ హీరోలకు సంబంధం ఉండదు. అయినా కొందరికి మాత్రం కొన్ని విషయాల్లో మ్యాచ్ అవుతుంటాయి. సో సరదాగ మన స్టార్స్ ని తమిళ స్టార్స్ తో పోల్చి చూస్తే ఎవరికి ఎవరు మ్యాచ్ అవుతారో చూద్దాం.

నంబర్ వన్ Chiranjeevi, Rajinikanthతొమ్మిదేళ్ల తర్వాత హీరోగా నటించినప్పటికీ చిరంజీవి బాక్స్ ఆఫీస్ కి తాను బాస్ అని నిరూపించుకున్నారు. టాలీవుడ్ నంబర్ వన్ స్థానం తనదేనని చాటారు. ఇదే విధంగా కోలీవుడ్ లో గత ఇరవై ఏళ్లుగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్.

ప్రయోగాల వీరులు Kamalhassan, Nagarjunaఒక స్టార్ ఇమేజ్ లో ఇరుక్కుపోవడం నచ్చని నటుడు కమలహాసన్. ఎప్పటికప్పుడు కొత్త కథల్లో సరికొత్తగా నటించడానికి సిద్ధపడుతుంటారు. అలా టాలీవుడ్ లో ప్రయోగాలకు పెద్ద పీఠ వేసేందుకు ఉత్సాహం చూపించే హీరో నాగార్జున.

పెద్ద స్టార్స్ Mahesh babu, Vijay Sethupathiకొన్ని సినిమాలతోనే మహేష్ బాబు పెద్ద స్టార్ గా అవతరించారు. టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా మహేష్ పేరు దక్కించుకున్నారు. మహేష్ లాంటి క్రేజ్, స్టార్ హోదా కలిగిన తమిళ నటుడు విజయ్. ఇతను కూడా వరుస విజయాలతో హ్యుజ్ స్టార్ అయ్యారు.

విపరీతమైన ఫాలోయింగ్ Pawan Kalyan, Ajithకొన్ని నియమాలపై కట్టుపడి ఉండడం, అందుకు ఎంతదూరమైనా వెళ్లడం పవన్ కళ్యాణ్ నైజం. ఇటువంటి లక్షణాలు కలిగిన స్టార్ అజిత్. అందుకే ఇక్కడ పవన్ కి, అక్కడ అజిత్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

యాంటీ ఫ్యాన్స్ లేని స్టార్స్ Venkatesh, Suryaకోట్లమంది అభిమానించే హీరోలకైనా యాంటీ ఫ్యాన్స్ ఉండడం కామన్. అసలు యాంటీ ఫ్యాన్స్ అంటూ లేని నటులు సూర్య (కోలీవుడ్), వెంకటేష్ (టాలీవుడ్). మహిళాభిమానులు వీరికి ఎక్కువమంది ఉన్నారు.

నేచురల్ స్టార్స్ Nani, Dhanushనాని సినిమాలు చూస్తుంటే కథ మాత్రమే కాకుండా హీరో నటన కూడా చాలా నేచురల్ గా ఉంటుంది. అలాంటి ఫీల్ ఇచ్చే మూవీలు తమిళం లో ధనుష్ చేస్తుంటారు.

కమెడియన్ కి మించి..Sunil, Santhanamతెలుగులో సునీల్ హాస్యనటుడిగా వందల సినిమాలు చేశారు. హీరోగానూ విజయాన్ని అందుకున్నారు. ఆ విధంగా తమిళంలో కమెడియన్ గా నటిస్తూ హీరోగానూ సక్సస్ అందుకున్న నటుడు సంతానం.

ఏ రోల్ అయినా రెడీ Rana, Vishalక్యారక్టర్ ఆర్టిస్టులుగా పనిచేసేవారు నెగిటివ్, పాజిటివ్ రోల్స్ పోషించడంలో ఇబ్బంది ఉండదు. కానీ హీరోగా సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించడానికి ఆర్య, రానా ఉత్సాహం చూపిస్తుంటారు.

వివాదాల హీరోలు Navadeep, Shimbuతమిళ మీడియాలో శింబు ఎప్పుడూ కనిపిస్తుంటారు. శింబు నటించిన విజయాల గురించి కాదు.. అతను ఇరుకున్న వివాదాల గురించి ఎక్కువగా ఛానల్స్ మాట్లాడుతుంటాయి. ఇక్కడ కూడా విజయాలకంటే వివాదాలు ఎక్కువగా ఉన్న హీరో నవదీప్.

కష్టమే వీరి బలం Raviteja, Sethupathiచిన్న చితకా పాత్రలు చేస్తూ గాడ్ ఫాదర్ అంటూ లేకుండా స్టార్ గా ఎదిగిన నటుడు మాస్ మహారాజ్ రవి తేజ. తమిళంలో అలాగే కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చిన నటుడు సేతు పతి.

కొత్త హీరోలండీ !Sampoonesh Babu, Power Star Srinivasanఆకర్షణీయమైన రూపు ఉంటేనే హీరో అనే రూల్స్ ని చెరిపేసిన నటుడు సంపూర్ణేష్ బాబు. తనదైన స్టైల్ తో
హీరో అంటే ఇలా కూడా ఉండొచ్చని కొత్త అర్ధాన్ని చెప్పారు. ఇతనిలాగే తమిళ నటుడు పవర్ స్టార్ శ్రీనివాసన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Share.