సాహో చిత్ర బృందానికి థాంక్స్ చెప్పిన శ్రద్ధ కపూర్!

బాలీవుడ్ భామలు షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వస్తే ఎప్పుడెప్పుడు ముంబై కి వెళ్లి పోదామా? అని ఉంటారు. ఇక్కడ వారు సౌకర్యవంతంగా ఫీలవరు. అందుకే భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ తెలుగు చిత్రాలకు బాలీవుడ్ హీరోయిన్స్ సైన్ చేయరు. ఇక నుంచి అటువంటి ఫీలింగ్ ఏమి ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ తన మొదటి తెలుగు సినిమా షూటింగ్ అనుభవాన్ని ట్విట్టర్ వేదికపై స్పష్టం చేసింది. ఆమె ప్రభాస్ సినిమా సాహో లో హీరోయిన్ గా నటిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా శ్రద్ధ కపూర్ ముంబయికి వెల్తూ “సాహో’ ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. అద్భుతమైన టీమ్‌తో పని చేయడం గొప్ప అనుభూతి. హైదరాబాద్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంది.’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో తెలుగు సినిమా షూటింగ్ అంటే జాలీగా ఉంటుందనే సందేశాన్ని తోటి నటీమణులకు ఆమె అందించారు. శ్రద్ధ నోటి నుంచి ఈ మాట రావాలని శ్రద్ధని సాహో చిత్ర బృందం ప్రత్యేక అతిథిగా చూసుకుంది. ప్రతి రోజూ 25 వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ తో భిజానం వడ్డించింది. షూటింగ్ గ్యాప్ లో బోర్‌ కొట్టకుండా ఉండడానికి సెట్‌లోనే చిన్న గేమింగ్‌ జోన్‌ ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అందించాయి.

Share.