నేను చేస్తున్నది ఒక్కటే రోలండి బాబు!

బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిన్నటి వరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రభాస్, బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ తిన్ ముకేష్, చుంకే పాండే లపై యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఈరోజు నుంచి అమీర్ పేటలో వేసిన ఇంటి సెట్ లో హీరోయిన్ శ్రద్ధ కపూర్, ప్రభాస్ పై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో శ్రద్ద డ్యూయెల్ రోల్ పోషిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలుచక్కర్లు కొట్టాయి.

ఈ విషయం తెలుసుకున్న శ్రద్ధ ఈరోజు స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పడేసింది. సాహోలో తాను ఒకే రోల్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్ లో షూటింగ్ అనంతరం చిత్ర బృందం దుబాయ్ కి వెళ్లనుంది. అక్కడి ప్రఖ్యాత ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.