విడుదలైన 8 వారాల వరకూ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై ప్రసారాలకు నో

సినిమా అనేది థియేటర్ లో చూడడం అనేది ఒక మంచి ఎక్స్ పీరియన్స్ లాంటిది. కానీ.. ఈమధ్య వచ్చిన అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వల్ల జనాలు థియేటర్లకి రావడం మానేశారు. సూపర్ హిట్ సినిమాలను కూడా నెల రోజుల లోపే ఆన్లైన్ లో ప్రసారం చేస్తుండడంతో జనాలు థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేశారు. ఈ విషయం గత కొన్ని నెలలుగా డిస్ట్రిబ్యూటర్లను, థియేటర్లను ఇబ్బందిపెడుతూనే ఉంది. ఈ విషయమై కొందరు నిర్మాతలు ఫిలిమ్ ఛాంబర్ లో తమ గోడును వెళ్లగక్కుకున్నప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోయింది.

అయితే.. ఎట్టకేలకు ఈ విషయమై ఫిలిమ్ ఛాంబర్ ఓ నిర్ణయం తీసుకొంది. సినిమా విడుదలైన 8 వారాల వరకూ అనగా రెండు నెలలలోపు సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎలాంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద రిలీజ్ చేయకూడదు అనేది వీరి ఫైనల్ డెసిషన్. ఈ నిర్ణయం నిర్మాతలు

Share.