వడ్డీలు పేట ఓటర్ లిస్ట్ లో కాజల్ ఫోటో చూసి షాకైనా జనాలు

కాజల్ అగర్వాల్ అసలు పేరు దీపికా పడుకొనే అంటున్నాడు వీడికేమైనా పిచ్చా! అని పిచ్చి పిచ్చిగా మమ్మల్ని తిట్టుకోకుండా అలా ఎందుకు అన్నామా అని తెలుసుకోండి. విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వడ్డీలు పేట అనే గ్రామానికి చెందిన ఓటర్ లిస్ట్ లో కాజల్ ఫోటో కనిపించింది. పోన్లే ఫోటో ఏదో పొరపాటున వచ్చింది అనుకుంటే.. దానికి పేరేమో దీపికా పడుకొనే, వయసు 22 అని పెట్టారు. దాంతో ఆ ఓటర్ లిస్ట్ చూసినవాళ్ళందరూ షాక్ అవ్వడమే కాదు… ఇంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఎలా చేస్తారా అని సదరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ను తిట్టిబోస్తున్నారు.

kajal-name-in-voter-list

ఇలాంటివి జరగడం కొత్తేమీ కాదు కానీ.. ఆంధ్రా ఎలక్షన్స్ మరో 15 రోజుల్లో జరగనున్న తరుణంలో ఈ తరహా సంఘటనలు వెలుగులోకి వస్తుండడంతో ప్రతిపక్ష నేతలు, నాయకులు వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో పాపులర్ చేస్తూ అధికార పార్టీ పనితీరుపై విరుచుకుపడుతున్నారు. దాంతో.. కాజల్, దీపికా పడుకొనేలా పేర్లు అనవసరంగా సినిమా రంగంలో మాత్రమే కాక రాజకీయరంగంలోనూ పాపులర్ అయిపోయాయి.

Share.