అక్క ఫస్ట్ మూవీ రాకుండానే.. చెల్లి నెక్స్ట్ మూవీని ఓకే చేసేసింది?

జీవితా రాజశేఖర్‌ కూతుర్లని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ తో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని నటిస్తున్న ‘2 స్టేట్స్’ చిత్రం కొన్ని కారణాల వలన ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే చిన్న కూతురు శివాత్మిక మొదటి చిత్రం విడుదల కాకముందే రెండో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేసింది. విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ తో కలిసి ‘దొరసాని’ చిత్రంతో వెండితెరకు కాబోతుతుంది శివాత్మిక. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 5న విడుదల కాబోతుంది.

అయితే మొదటి చిత్రం ‘దొరసాని’ రిలీజ్‌ కాకుండానే శివాత్మిక మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. అతిత్వరలో ‘రాజ్‌దూత్‌’ అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు శ్రీహరి తనయుడు మేఘాంశ్‌. తన రెండో చిత్రంలో శివాత్మిక ను హీరోయిన్‌గా ఎంచుకున్నారట చిత్ర యూనిట్. నూతన దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని.. మేఘాంశ్‌ తొలి చిత్ర నిర్మాత ఎమ్‌ఎల్‌వీ సత్యనారాయణే నిర్మిస్తున్నాడట. తన అక్క మొదటి చిత్రం విడుదల కాకముందే శివాత్మిక తన రెండో చిత్రాన్ని కూడా లైన్లో పెట్టేసి దూసుకుపోతుండడం విశేషం.

Share.