సృహతప్పి పడిపోయిన అర్జున్ రెడ్డి హీరోయిన్!

అర్జున్ రెడ్డి సినిమాతో షాలిని పాండే తెలుగురాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా అద్భుతంగా నటించి మంచి పేరుతో పాటు, అవకాశాలను అందుకుంది. షోరూం ఓపెనింగ్ లకు కూడా ఆమెను పిలుస్తున్నారు. అందులో భాగంగానే నెల్లూరు కి వెళ్లిన షాలిని అస్వస్థకు గురైంది. ఈరోజు ఉదయం పది గంటలకు నెల్లూరు లోని షాప్ ని ప్రారంభించిన ఆమె, తర్వాత లైవ్ మ్యూజిక్ కార్యక్రమానికి హాజరైంది. ఆ షో చూస్తుండగానే సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగారుపడ్డ షాపు యాజమాన్యం శాలినిని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో స్ట్రైచర్ పై తీసుకెళ్లే సమయంలో శరీరంపై తెల్లటి వస్త్రం కప్పి ఉంచారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమెకు ఏమైందని అందరూ ఆందోళన పడ్డారు. అయితే కొంతసేపు ఐసీయూలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం షాలిని కోలుకున్నారు. కొత్త వాతావరణానికి తట్టుకోలేక కాస్త కళ్ళుతిరిగాయని వైద్యులు చెప్పారు. పూర్తిగా కోలుకున్నతర్వాత ఫేస్ బుక్ లో స్వయంగా షాలిని తన ఆరోగ్యం గురించి వివరించింది. జ్వరం, తలనొప్పి కారణంగా ఆస్పత్రికి వెళ్లానని, చికిత్స తర్వాత తాను బాగున్నానని, కంగారు పడవద్దని అభిమానులకు చెప్పింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.