మేకింగ్ వీడియో కూడా టీజర్ లా ఉందిగా!

షూటింగ్ మొదలై ఏడాదిన్నర అవుతోంది, ఇప్పటివరకూ సినిమాకి సంబంధించిన లీక్డ్ స్టిల్స్ లేదా వీడియోస్ బయటకి రావడం తప్ప అఫీషియల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయలేదు యూనిట్. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ దర్శకుడు సుజీత్ పై కాస్త కోపంగానే ఉన్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగానైనా టీజర్ రిలీజ్ చేస్తారేమో అని ఆశపడిన అభిమానులకు “మేకింగ్ వీడియో రేపు రిలీజ్ చేస్తున్నాం” అంటూ ఎనౌన్స్ చేసేసరికి.. “ఇన్నాళ్లపాటు షూట్ చేసి సింపుల్ గా మేకింగ్ వీడియో రిలీజ్ చేయడం ఏంట్రా?” అని మళ్ళీ గుస్సా అయ్యారు. టీం అనుకున్నట్లుగానే ఒక అరగంట క్రితం మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. సాధారణంగా మేకింగ్ వీడియోస్ అంటే.. ఆర్టిస్టులందరూ కూర్చున్నప్పుడు లేదా ఏదైనా సీన్ షూట్ చేస్తున్నప్పటి వీడియోను విడుదల చేస్తుంటారు.saaho-prabhas1

కానీ.. “సాహో” టీం విడుదల చేసిన “షేడ్స్ ఆఫ్ సాహో” సిరీస్ 1 చూశాక అభిమానులు షాక్ అయ్యారు. మేకింగ్ వీడియో కూడా టీజర్ లా ఉంది. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్టాండర్డ్స్ మేకింగ్ & హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ తోపాటు.. వీడియో చివర్లో ప్రభాస్ స్టైలిష్ గా నడుచుకుంటూ వచ్చే క్లిప్ చూసి అప్పటివరకూ సుజీత్ ను తిట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఖుషీ అయిపోయారు. మేకింగ్ వీడియో చూస్తుంటే.. ‘సాహో” టీం ఒక అత్యధుతమైన యాక్షన్ ఫిలిమ్ ను తెలుగు సినిమాకి అందించనుందని మాత్రం అర్ధమవుతోంది.saaho-prabhas2

ఇకపోతే.. ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే దీన్ని మేకింగ్ వీడియో అనడం కంటే “BTS Footage” (బిహైండ్ ది సీన్) అనడం బెటర్. ఎందుకంటే.. ఈ వీడియో మేకింగ్ కి సినిమా యూనిట్ తో సంబంధం ఉండదు. వాళ్ళు షూటింగ్ ప్రొసెస్ మొత్తాన్ని షూట్ చేసి ఇలా వీడియోస్ సబ్మిట్ చేస్తుంటారు. సో, షూట్ జరుగుతునప్పుడు తీసిన ఫుటేజే ఈ స్థాయిలో ఉంటే.. ఇక సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో ఊహించడం కష్టమే. ఇకపోతే.. ఈ సిరీస్ లో మరిన్ని వీడియోస్ రానున్నాయి.

saaho-prabhas3saaho-prabhas4 saaho-prabhas5

Share.