సంచలనాల “స్టైలిష్ స్టార్” – “అల్లు అర్జున్”

నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం అని సింహాద్రిగా ప్రేమ గీతం పాడినా….
మై లవ్ ఇస్ గాన్….. మై లవ్ ఇస్ గాన్ అంటూ విరహ గీతం ఆలపించినా…
సత్తె ఏ గొడవా లేదు… సత్తె ఏ గోలా లేదు…. అంటూ కుర్రాడూ కిక్కెక్కి పాడినా….
సినిమా చూపిస్తా మామా….నీకు సినిమా చూపిస్తా మామా అంటూ పోరగాడు అల్లరి చేసినా… అది యువ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు….అల్లు వారి వారసుడు…అభిమానులు ముద్దుగా ‘బన్నీ’ అని పిలుచుకునే అభిమాన హీరో, సినీ అరంగేట్రం చేసి, తెలుగు తెరకు పరిచయం అయిన అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కే చెల్లింది. మేనమామ డాడీ సినిమాలో డ్యాన్సర్ గా పరిచయం అయిన ఈ కుర్ర హీరో….దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుగారి చేతుల మీదగా నటనలో ఓనమాలు దిద్దాడు. అక్కడ మొదలు హిట్ వెనుక హిట్ కొడుతూ, కలక్షన్ల ప్రభంజనానికి సరికొత్త అర్ధాన్ని చూపిస్తూ రేస్ గుర్రంలా దూసుకుపోతున్నాడు ఈ ‘సరైనోడు’. సహజంగా తెలుగువారికి బన్నీగా దగ్గరైన అల్లు అర్జున్ కు తెలుగులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా బన్నీ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు…దానికి నిదర్శనం…అల్లు అర్జున్ కేరళ లో మల్లు అర్జున్ అని పిలవడమే. మరి ఇంతగా అభిమానుల్ని, ప్రేక్షక సంద్రాన్ని తనవైపు తిప్పుకున్న ఈ యువహీరో సినిమా కరియర్ లో మైలు రాళ్ళను ఒక లుక్ వేద్దాం రండి.

“సింహాద్రి” పాత్రలో

Gangotri,Allu Arjun,Allu Arjun Movies,తొలి సినిమా గంగోత్రిలో ‘సింహాద్రి’ పాత్రతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మన బన్నీ ఆ సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అమాయకపు కుర్రాడిపాత్రలో.యవ్వనంలో తన ప్రేమను బ్రతికించుకునే పాత్రలో ఆయన నటన అద్భుతహ అనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో ఆయన నటనకు మెచ్చి ఉత్తమ నూతన నటుడుగా….సిని”మా” అవార్డ్ ఆయన్ని వరించింది.

ఆర్య

Arya,Allu Arjun,Allu Arjun Movies,తొలి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న బన్నీ, కమర్షియల్ హీరోగా, బారి సక్సెస్ అందించిన సినిమా ఆర్య. డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కధ, మెస్మరైజింగ్ కధంతో ఈ సినిమా భారీ హిట్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమాలో ఆర్య పాత్రలో అల్లు అర్జున్ నటనను వార్ణించడానికి మన బాష సరిపోదు అంటే అతిశయోక్తి కాదు. ఆయన నటనకు మెచ్చి ఈ చిత్రానికి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం ఆయన్ని అక్కున చేర్చుకుంది.

బన్నీ

Bunny,Allu Arjun,Allu Arjun Movies,తొలి రెండు సినిమాలు ప్రేమ కధా చిత్రాలుగా బన్నీ కి మంచి లవర్ బోయ్ ఇమేజ్ ను తెచ్చిపేడితే బన్నీ సినిమా ఆయనకు మాస్ హీరోగా మంచి గుర్తింపునిచ్చింది. ఒక్కసారిగా లవర్ బోయ్ బన్నీ….ఈ చిత్రంతో మాస్ హీరో అయిపోయాడు. ప్రముఖ దర్శాకుడు వినాయక్ సంధించిన ఈ బాణం అప్పట్లో భారీ హిట్ ను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల వర్షం కురిపించింది.

దేశముదురు

Desamuduru,Allu Arjun,Allu Arjun Movies,పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలయిన ఈ చిత్రంలో బన్నీ మెస్మరైజింగ్ నటనతో ఆకట్టుకున్నాడు. ఆ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం మ్యూజిక్ పరంగా భారీ హిట్ సాధించింది. ఇక ఈ చిత్రంలో బన్నీ నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ ఆయనకు దాసోహం అయ్యింది.

“కేబుల్ రాజు” పాత్రలో

Vedam,Allu Arjun,Allu Arjun Movies,స్టార్ హీరోగా టాలీవుడ్ ను ఏలుతున్న బన్నీ, ప్రత్యేక పాత్రలో….కేబల్ రాజుగా వేదం లో నటించాడు. మల్టీ స్టారర్ సినిమాలు కనుమరుగైపోతున్న ప్రస్తుత సినిమా ప్రపంచంలో నేటి తరం హీరో మంచి మనోజ్ తో కలసి వేదంలో జీవిత వేద్దాన్ని చూపించాడు. అయితే ఆర్ధికంగా ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేదు కానీ, ఈ చిత్రంలో బన్నీ నటనకు దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ బన్నీకి దక్కింది.

“రవీంద్ర నారాయణ్” పాత్రలో

Julayi,Allu Arjun,Allu Arjun Movies,అల్లు అర్జున్ లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సందించిన ‘జులాయి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల ప్రభంజనం సృష్టించింది. దాదాపుగా ఈ సినిమాతో బన్నీ 50 కోట్ల క్లబ్ లో చేరేందుకు ఈ సినిమా కారణం అయ్యింది.

ఎవడు

Yevadu,Allu Arjun,Allu Arjun Movies,తన స్టార్ డమ్ ను పక్కన పెట్టి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తో కలసి ‘ఎవడు’లో ప్రత్యేక పాత్రలో నటించి అభిమానుల్ని మెప్పించాడు బన్నీ.

‘లక్కీ’ పాత్రలో

Racegurram,Allu Arjun,Allu Arjun Movies,

రేస్ గుర్రం సినిమాలో అల్లు అర్జున్ చేసిన లక్కీ పాత్ర బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ ను నమోదు చేసింది. ఈ సినిమాలో బన్నీ నటన, ఆయన బాడీ ల్యాంగ్వేజ్ సూపరో…సూపరు.

“గోనగన్నారెడ్డి” పాత్రలో

Rudrama Devi,GonaGannaReddy,Allu Arjun Movies,అనుష్క ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ సందించిన చారిత్మాత్మక ఘట్టం ఈ రుద్రమదేవి చిత్రం. ఇక ఈ చిత్రంలో బన్నీ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర ప్రేక్షకుల మనసు దోచుకోవడమే కాకుండా..విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ చాలా ప్రభావితం చేసిన పాత్ర అనే చెప్పాలి ఎందుకంటే, ప్రత్యేకంగా ఈ పాత్ర కోసం సినిమాను వీక్షించిన వారు సైతం ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు.

‘విరాజ్ ఆనంద్’ పాత్రలో

Allu Arjun,Allu Arjun Movies,

తండ్రి మీద ప్రేమతో, ఆయన విలువలు కాపాడే కొడుకుగా, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో బన్నీ యాక్టింగ్ అద్భుతం. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అనుకోలేనప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం సందడి చేసింది.

సరైనోడు

Sarrainodu,Allu Arjunప్రముఖ నిర్మాత అల్లు ఆరవింద్ నిర్మాణంలో, సంచలనాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో త్వరలో సరైనోడుగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్దం అవుతున్నాడు బన్నీ…మరి ఈ చిత్రం ఘన వియజయం సాధించి బన్నీ ఖాతాలో మరో ప్రభంజనానికి శ్రీకారం చుట్టాలి అని కోరుకుంటూ…

ఇలా ప్రతీ సినిమాకు తనలోని వేరీయేషన్స్ ను చూపిస్తూ, తనదైన శైలిలో రేస్ గుర్రంలాగా దూసుకుపోతున్నాడు బన్నీ….. మరి ఏప్రిల్ 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న మన  ‘సరైనోడు’కు ఇవే మా హృదయ పూర్వక జన్మధిన శుభాకాంక్షలు

Share.