రామ్ చరణ్, సుకుమార్ చిత్రంలో నటించనున్న అలనాటి బొద్దుగుమ్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన ధృవ హిట్టయింది. నిర్మాతగా చేసిన ఖైదీ నంబర్ 150 మూవీ నేడు రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక చెర్రీ కొత్త ప్రాజక్ట్ పనుల్లో బిజీకానున్నారు. టెక్నీకల్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చరణ్  చేయనున్న సినిమా వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తోకలిసి డైరక్టర్ లొకేషన్స్ సెలక్ట్ చేశారు.  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ అయ్యారు. మెగా పవర్ స్టార్ సరసన ఈ సారి  అనుపమ పరమేశ్వరన్ జోడి కట్టనుంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ అద్భుతమైన కథలో ఓ కీలక పాత్ర ఉందని, అందుకు అలనాటి హీరోయిన్ రాశిని చిత్ర బృందం ఎంపిక చేసినట్లు తెలిసింది. అనేక హిట్ చిత్రాల్లో ప్రధాన హీరోయిన్ గా చేసిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. కొంతకాలం క్రితం  కళ్యాణ వైభోగమే’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన రాశి, చరణ్ సినిమాలో మంచి రోల్ సాధించింది. ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.