పద్మవ్యూహంలో అర్జునిడిలా సవ్యసాచి

“చావైనా నిను చేరాలంటే అది నీ ఎడమ చేయి దాటి రావాలి”.. అనే డైలాగ్ తోనే డైరక్టర్ చందు మొండేటి కథ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో చెప్పారు. విక్రమ్ అనే ఒకడిలో ఆదిత్య అనే మరొకడు ఉంటే.. ఎలా ఉంటుందో.. అదే సవ్యసాచి. ఇప్పటివరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అక్కినేని నాగచైతన్య నటించి సాహసం చేసారు. అతనికి పోటీగా అలనాటి హీరో మాధవన్ విలన్ గా నటించడం మరో విశేషం. ‘ప్రేమమ్’ చిత్రం తర్వాత చందు మొండేటి, యువ సామ్రాట్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. నేడు ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది.

చైతూ ఈ సినిమాకోసం పడిన కష్టం ఈ వీడియో కళ్లకు కట్టింది. ఒకరిలో ఇద్దరుంటే వచ్చే కష్టాలను నవ్వులతో చెప్పి.. లాభాలను యాక్షన్ తో చూపించారు. కీర‌వాణి సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కిస్తుందని చెప్పకనే చెబుతోంది. పద్మవ్యూహంలో అర్జునిడిలా చైతూ పోరాడుతున్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భూమిక కీలకరోల్ పోషించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 2వ తేదీన విడుదల కానుంది.

Share.