బాహుబలి రికార్డ్స్ పై గురిపెట్టిన సంఘమిత్ర

బాహుబలి చిత్రాన్ని చూసిన ఇతర భాషా దర్శకులు, టెక్నీషియన్లు అంతకంటే మంచి సినిమా తీయాలనే సంకల్పించుకున్నారు. బాహుబలి స్ఫూర్తిగా మొదలైన వాటిలో మొదటి ప్రాజెక్ట్ సంఘమిత్ర. ఈ భారీ చిత్రాన్ని తమిళ దర్శకుడు సుందర్.సి తెరకెక్కించనున్నారు. జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేన్స్ వేడుకలో రిలీజ్ చేశారు. యువరాణిగా శృతి గుర్రం ఎక్కిన పోస్టర్ అన్ని పరిశ్రమలు ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు అనంతరం విడుదలైన పెద్ద ఓడ లో వీరుడు నిలబడి ఉన్న పోస్టర్ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేలా చేసింది.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బాహుబలి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడం విశేషం. ఈ సినిమాలో కూడా భారీ పోరాటాలు, కత్తి విన్యాసాలు ఉండనున్నాయి. మరి దర్శకేంద్రుడు రాజమౌళి మాదిరిగా సుందర్.సి తెరకెక్కించగలరా? అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.