చైతూ కోసం మరో క్యామియో ప్లే చేసిన సమంత

అక్కినేని ఇంటి కోడలు అవ్వడానికి ముందే నాగచైతన్యతో కలిసి మూడు సినిమాలు చేసిన సమంత.. పెళ్లి అనంతరం నాగచైతన్య, నాగార్జునల కోసం వారు నటించిన ప్రతి సినిమాలో గెస్ట్ రోల్ లేదా స్పెషల్ క్యామియో ప్లే చేయడం కామన్ అయిపోయింది. ఇటీవల “మన్మధుడు 2″లో నాగార్జున కోసం ఒక స్పెషల్ రోల్ ప్లే చేసిన సమంత ఇప్పుడు అదే తరహాలో నాగచైతన్య కోసం “వెంకీ మామ” సినిమాలోనూ ఒక ప్రత్యేక అతిధి పాత్ర పోషించిందట సమంత.

ఇంకా ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేనప్పటికీ.. సమంత రీసెంట్ గా “వెంకీ మామ” షూటింగ్ జరుగుతున్న లొకేషన్ స్పాట్ కి తన పర్సనల్ స్టాఫ్ తో సహా వెళ్ళడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆల్రెడీ రాశీఖన్నా, పాయల్ రాజ్ పుట్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి సమంత స్పెషల్ రోల్ ఎంతవరకూ పనికొస్తుందో చూడాలి.

Share.