సమంత విషయంలో నాగ్ ఫైనల్ డెసిషన్?

ఇప్పుడు నాగార్జున సీక్వెల్స్ పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం తన కెరీర్లో ఆల్ టైం హిట్ గా నిలిచిన ‘మన్మధుడు’ చిత్రం సీక్వెల్ అయిన ‘మన్మథుడు 2’ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు నాగ్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఆగస్టు 9 న విడుదల కాబోతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ టీజర్లో మంచి స్టైలీష్ గా కనిపిస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రం తరువాత ‘బంగార్రాజు’ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ఇది సీక్వెల్.

గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ డ్రామాగా ‘బంగార్రాజు’ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించనుంది. ఇక ఆయన మనవడిగా నాగచైతన్య నటిస్తాడట. ఇక చైతూకి జోడీగా సమంతను తీసుకుంటే బాగుంటుందని నాగ్ కు చాలా మంది చెప్పారట. అంటే నాగ్ కు సమంత మనవరాలన్న మాట..! సమంతను తీసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడుతుందని వారు భావిస్తున్నారట. అయితే నాగ్ మాత్రం ‘ఓ బేబీ’ ఫలితాన్ని బట్టి చూద్దాం అని చెప్పారట. ఇక ‘మన్మధుడు2’ చిత్రంలో కూడా సమంత ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Share.