అత్త పుట్టిన రోజు వేడుక వీడియోని షేర్ చేసిన కోడలు!

అక్కినేని నాగార్జున సతీమణి అమల నిన్న (మంగళవారం) 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుకున్న ఆమెకు నాగ్ ప్రత్యేకంగా విష్ చేశారు.  ‘ఐ లవ్యూ స్వీట్‌ హార్ట్‌.. నీతో కలిసి మరెన్నో సంవత్సరాలు ఇలాగే జీవించాలని కోరుకుంటున్నా.. హ్యాపీ బర్త్‌ డే’ అంటూ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. వెండి తెరపైన పర్ఫెక్ట్ కపుల్ గా హిట్స్ అందుకున్న ఈ జంట నిజ జీవితంలోను పాతికేళ్లుగా ఉత్తమ దంపతులుగా పేరు పొందారు.

కేవలం శుభాకాంక్షలతోనే సరిపెట్టకుండా అమల పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యుల చప్పట్ల నడుమ అమల కేక్ కట్ చేశారు. ఈ వీడియోను స‌మంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం బాగా లైక్లు, షేర్ అందుకుంటోంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.