రాజుగారి గది 2 లో సమంత చేసే రోల్ అదేనంట

బుల్లితెర యాంకర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన  హారర్ కామెడీ ‘రాజుగారి గది’ సినిమా సూపర్ హిట్ అయింది. అందుకు సీక్వెల్ గా రాజుగారి గది 2 తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగార్జున మానసిక వైద్యుడిగా నటిస్తున్నారు. అంతేకాదు ఆయన కోడలు సమంత కూడా గెస్ట్ రోల్ పోషిస్తోంది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో సమంతది గెస్ట్ రోల్ కాదంట.. గోస్ట్ రోల్ అని టాలీవుడ్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. అంత అందమైన అమ్మాయిని దెయ్యం చేశారు కదరా.. అంటూ ఆమె అభిమానులు బాధపడుతుంటే.. మరికొంతమంది ఆత్మగా సమంత ఎలా ఉంటుందో చూడాలని ఆరాటపడుతున్నారు.

ఇక కథలోకి వెళితే సమంత పోషించే దెయ్యం చుట్టూ కథ నడుస్తుందని తెలిసింది. అలాగే నాగార్జునకు, సమంతకు మధ్య ఉండే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని సమాచారం. పివిపి సినిమా, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, అశ్విన్ బాబు, ప్ర‌వీణ్, ష‌క‌ల‌క శంక‌ర్, సీరత్ కపూర్ త‌దిత‌రులు నటిస్తున్నారు. ఇందులోనూ ఓంకార్ హారర్ తో పాటు కామెడీని జోడించినట్లు చిత్ర బృందం వెల్లడించింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.