నాగచైతన్యకి షాకిచ్చిన సమంత..!

నాగ చైతన్యతో పెళ్ళైన తరువాత గ్లామర్ పాత్రల్ని కాకుండా కేవలం కథాబలం ఉన్న సినిమాలనే చేస్తూ ముఖ్యంగా తన పాత్రకి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ వస్తుంది సమంత. అయితే… అప్పుడప్పుడూ తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… ఆ లోటుని కూడా తీర్చేయాలనుకుంటుందో ఏమో… అప్పుడప్పుడు తన గ్లామర్ షో చేస్తూ ఉండే పిక్స్ పెట్టి నెటిజన్ల ట్రోలింగ్ కి కూడా గురవుతుంది. త్వరలోనే ‘మజిలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది సమంత.]

ఇక తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం పట్ల చైతన్య ఎలా రియాక్ట్ అవుతాడు అనే ప్రశ్నకి సమంత సమాధానమిస్తూ … “నా ఫోటోలని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం నా భర్తకు (నాగ చైతన్య) నచ్చడం లేదు. అలా అని నా ఈ విషయంలో నా పై కోపమేమీ చూపించడు. నాకు నచ్చిందే నేను చేస్తున్నాను అనుకుని నన్ను అర్ధం చేసుకుంటాడు. తనకు నచ్చిందే తాను చేస్తున్నానని, ఇతరుల అభిప్రాయాలను, విమర్శలను లెక్కచేయబోనని తెలిపింది. తాజాగా విజయ్ సేతుపతితో కలసి నటించిన ‘సూపర్ డీలక్స్’ విడుదలకు సిద్ధమవుతున్నసందర్భంలో నిర్వహించిన ప్రమోషన్లకి చెన్నై వచ్చిన సమంత మీడియాతో మాట్లాడింది. ‘ఈ చిత్రంలో తనది వ్యాంప్ పాత్రని… దీని గురించి చైతూకు చెప్పగానే షాక్ అయ్యాడని, కానీ, తనకు కథ నచ్చడంతో అంగీకరించానని చెప్పుకొచ్చింది. ‘కెప్టెన్ మార్వెల్’ వంటి సూపర్ ఉమెన్ స్టోరీతో ఎవరైనా తనను సంప్రదిస్తే… కచ్చితంగా నటిస్తానని కూడా సమంత చెప్పుకొచ్చింది. ఇక ‘ఓ బేబీ’ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ… ‘ఇది వినోద భరితమైన్ చిత్రమని, ఆది నుంచి చివరి వరకూ నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని’ క్లారిటీ ఇచ్చింది. ఏదేమైనా ఈ సమ్మర్ కి మూడు చిత్రాలతో సమంత కనువిందు చేయనుందన్న మాట.

Share.