ప్రభాస్ ‘సాహో’ లో బాలీవుడ్ కండల వీరుడు?

తాజాగా విడుదలైన ప్రభాస్ “సాహో” ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పోస్టర్ ఇండియన్ వైడ్ ట్రెండ్ అయ్యింది. లుక్ సో సో గానే ఉన్నప్పటికీ.. విడుదల తేదీ ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రెండు సంవత్సరాల నుండీ ప్రభాస్ సినిమా ఏమీ రాకపోవడంతో… వాళ్ళు ‘సాహో’ చిత్రం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘సాహో’ చిత్రంలో స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ఓ ఆర్టికల్ రాసుకొచ్చింది.

‘సాహో’ లో నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సల్మాన్ కు నీల్ నితిన్ మంచి స్నేహితుడు కావడంతో ఓ ముఖ్య క్యామియో రోల్ కి సల్మాన్ పేరును నిర్మాతలకు సిపార్సు చేసాడంట. ఈ క్రమంలో నిర్మాతలు కూడా సల్మాన్ ను కలిశారట. ఐతే ఈ రోల్ ని సున్నితంగా తిరస్కరించాడట సల్మాన్. “భరత్” చిత్ర ప్రమోషన్స్ లో సల్మాన్ చాలా బిజీ గా గడుపుతున్నాడు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రభాస్ కు అత్యంత సన్నిహితులైన వంశీ, ప్రమోద్ లు… ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ కి జోడిగా శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Share.