పెళ్లి చేసుకొనంటున్న స్టార్ హీరోయిన్..!

నిన్నమొన్నటివరకూ సాయి పల్లవి అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే.. మహా అయితే ఆమె సహజంగా నటిస్తుందనో లేక మంచి డ్యాన్సర్ అనో రీజన్స్ చెబుతారు. కానీ.. ఆమెను మనస్ఫూర్తిగా ఇష్టపడడానికి సరైన రీజన్ ఇన్నాళ్లకు దొరికింది. సాధారణంగా ఏ అమ్మాయికైనా చదువు, ఉద్యోగం తర్వాత పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం. కొందరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటే.. ఇంకొందరు హ్యాపీగా మనసుకి నచ్చినవాడిని ప్రేమించి పెళ్ళాడుతున్నారు. కానీ.. సాయిపల్లవి మాత్రం తాను జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పేసింది. అదేదో.. మగాళ్ల మీద కోపం వల్లనో లేక ఫెమినిస్ట్ అవ్వడం వల్లనో అనుకుంటే పొరబడినట్లేనండోయ్.

సాయిపల్లవి పెళ్లి చేసుకొను అని చెప్పడానికి కారణం ఆమెకు తన తల్లిదండ్రుల మీద ఉన్న అమితమైన ప్రేమ. తాను జీవితాంతం తన తల్లిదండ్రుల్ని దగ్గరుండి చూసుకోవాలనుకుంటుందట. పెళ్లి చేసుకుంటే అది కుదిరే విషయం కాదు కాబట్టి జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఈ విషయం తెలిసిన సాయిపల్లవి ఫ్యాన్స్ ఒక విధంగా బాధపడుతున్నప్పటికీ.. ఇంకొందరు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయానికి గర్వపడుతున్నారు. మరి భవిష్యత్ లో ఆమె ఆలోచన ఏమైనా మారుతుందో లేదో చూడాలి.

Share.