తన కెరీర్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సాయి పల్లవి

‘ప్రేమమ్’ చిత్రంలో సాయి పల్లవి నటన కోసం మలయాళం రాకపోయినా.. సుబ టైటిల్స్ పెట్టుకుని మరీ తెగ చూసారు మన తెలుగు ప్రేక్షకులు. సాయి పల్లవి అంత సహజంగా కనిపిస్తూ.. అలాంటి సహజమైన నటన కనపరుస్తుంది. ఇక డాన్సులు కూడా ఇరక్కొట్టేస్తుంది. అలాంటి భామ ‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైతే మన ప్రేక్షకులు ఫిదా అవ్వరా మరి. తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకి అభిమానులైపోయారు. ఓ మిడిల్ ఆర్డర్ హీరో సినిమాలో సాయి పల్లవి నటిస్తుందంటే ఆ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు. అయితే గత కొంత కాలంగా ఈ భామకి సక్సెస్ లేదు. చేసిన ప్రతీ సినిమా ప్లాపవుతుంది.

అయితే ఈ ప్లాపులకి నేనేమీ భయపడనను అంటుంది ఈ భామ.తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన కెరీర్ గురించి పలు ఆసక్తికరమైన వివరాలు తెలిపింది. సాయి పల్లవి మాట్లాడుతూ.. ” ఈ ప్లాపులతో నా సినిమా కెరీర్ క్లోజయితే హ్యాపీగా నా వైద్య వృత్తిలో కొనసాగుతాను. వైద్య విద్య చదివి నటిగా ఎదిగాను. ఒక వేళ ఈ ఇండస్ట్రీలో తేడా కొడితే ఎక్కువ రోజులు ఇక్కడే పాతుకుపోను. ఉన్నన్ని రోజులు వీలైనంత వరకూ డిఫరెంట్ రోల్స్ చేస్తాను.. అవకాశం వస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మంచి సందేశాత్మక చిత్రాల్లో నటిస్తాను. అదే నా చిరకాల కోరిక” అంటూ చెప్పుకొచ్చింది ఈ రౌడీ బేబి.

Share.