తేజు, బన్నీ ల మధ్య గొడవేంటి..?

దాదాపు మూడేళ్ళ తరువాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ హిట్టందుకున్నాడు. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రూపొందిన ఈ ‘చిత్రలహరి’ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతూ సెకండ్ వీక్ లోకి ఎంటరయ్యింది. ఈ చిత్రం సాయి తేజ్ నటనకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సక్సెస్ కోసం పరితపించే ‘అండర్ డాగ్’ క్యారెక్టర్ ను బాగా ఓన్ చేసుకుని.. ప్రశంసలందుకున్నాడు. ఇదిలా ఉండగా.. బన్నీతో తేజు కు మనస్పర్ధాలున్నాయని… అందుకే తేజు సినిమాల పై బన్నీ ఎప్పుడూ పెద్దగా స్పందించడని… గత కొంతకాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఈ విషయం పై తేజు స్పందించాడు.

సాయి తేజ్ మాట్లాడుతూ.. “నేను తరుచుగా వరుణ్ తేజ్, చరణ్ లను కలుస్తుంటాను, కానీ బన్నీతో ఎప్పుడో ఒకసారి గాని కలవను. అయితే కలిసినప్పుడు మాత్రం మేం చాలా బాగా ఉంటాం. మా మధ్య ఎక్కువుగా సినిమాల గురించి చర్చలు జరుగుతుంటాయి. అయినా బన్నీ నేను చిన్నప్పటి నుండీ కలిసే పెరిగాం. అలాంటి మా మధ్య గొడవలు ఎందుకు వస్తాయి.. ? మీడియాలో వస్తోన్న ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అంటూ చెప్పుకొచ్చాడు తేజు

Share.